BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS »

Tuesday, December 23, 2008

భద్రాచల నరసింహ



భద్రాచల
శ్రీ సీతా రామచంద్ర స్వామి వారి దేవస్థానం వారి అనుబంధ ఆలయం
శ్రీ భద్రాచల యోగానంద జ్వాలా లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయం, చప్తాదిగువ, భద్రాచలం.
ఆలయానికి సంభందించిన విశేషాలతో బ్లాగ్ నిండి వుంటుంది. భద్రాచలం లోని మరి కొన్ని విశిష్ట ఆలయముల గురించి కూడా బ్లాగులో పొందుపరుస్తున్నాం.

భద్రాచలం పుణ్యక్షేత్రం, పుణ్యతీర్థం అఖిల భారత దేశానికే ఆరాధ్యదైవం శ్రీ రామచంద్ర ప్రభువు . విశ్వ మానవాళి కి ఆదర్శ దంపతులు సీతారాములు . భద్రాచల క్షేత్ర మహిమ బ్రహ్మా పురాణ ప్రసిద్ధం. పంచరాత్రగమ ప్రసస్తం .మోక్ష లక్ష్మి విలసిత పీఠం భద్రాచలం. పావన గోదావరి తీరాన వెలసింది భద్రగిరి.

రామాయణ కాలం లోనే భద్రాచల ప్రాంతం ప్రసిద్ది. శ్రీ రామ చంద్ర మూర్తి, సీత , లక్ష్మణులు అరణ్య వాసం కోసం పర్ణశాల లో (భద్రాచలం నుండి గంట ప్రయాణం) గడిపారని రామాయణం లో చెప్పబడినది. అలానే శబరి కూడా ఇదే ప్రాంతానికి చెందినది గా తెలుస్తున్నది. ఆదర్శ ధర్మ మూర్తి శ్రీ రామచంద్ర మూర్తి వెలసిన భద్రాచల ప్రాంతం పరమ పవిత్రం.పావన గోదావరి శ్రీ సీత రామ లక్ష్మణుల పాదాలు తాకాలి అని ఎగాసిపడుతున్నతు గా, ప్రదక్షిణ చేస్తున్న భక్తురాలి గా అనిపిస్తుంది క్షేత్రం లో . " అదిగో అదిగో భద్రగిరి, ఆంధ్ర జాతి కిది అయోధ్యపురి , వాల్మీకి రాయని కథగా, సీతారాములు తనపై వోదగా , రామదాస కృత రామ పదామ్రుత వాగేయస్వర సంపదగా , వెలసిన దక్షిణ సాకేతపురి..." అని ఒక కవి అద్భుతంగా వర్ణించాడు భద్రగిరి శోబను. అటువంటి భద్రగిరి శికరానా శ్రీ యోగానంద లక్ష్మి నృసింహ స్వామి వారి ఆలయం కూడా విరాజిల్లుతున్నది. రామాలయం నుండి గోదావరికి వెళ్ళే దారిలో ఒక చిన్న గుట్ట పై ఉంది శ్రీ నరసింహ స్వామి వారి ఆలయం.

సహస్ర సూర్య తేజం తో ప్రకాశిస్తూ , అపార కరుణా కటాక్ష వీక్షణలు ప్రసరిస్తూ ప్రసన్న; వదనుడై, యోగ సమాధి లో బ్రహ్మానంద స్వరూపుడై వెంచీసియున్నారు శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి వారు. లక్ష్మి నరసింహుని చరితం మధురాతి మధురం. పాపి కొండల వద్ద గోదావరి నదిలో స్వామి వారి అర్చారూపం ఉద్భవించింది. దీనికి సంబంధించి ఒక కథ ప్రాచుర్యం లో ఉంది. యోగానంద లక్ష్మి నరసింహ స్వామి మానవ నిర్మిత మూర్తి కాదు. దేవత నిర్మిత లేక మహర్షి నిర్మిత మూర్తి అయి ఉన్నాడు.  
పూర్వకాలం గోదావరి నది పైనే రాజమహేన్ద్రికి పడవలు వుండేవి భద్రాచలం నుండి. పాపికొండల వద్ద ఒకానొక ప్రదేశం లో పడవలు ఆగి పోతున్దేవి. గోదావరి జలాల లోంచి బొబ్బలు వినిపించేవి. కొబ్బరి కాయలు కొట్టి హారతులు ఇస్తేనే కాని పడవలు ముందుకు కదిలేవి కావు. వింత తెలుసు కోవడానికి కొందరు పరిశోధకులు గజ ఈతగాల్లను రప్పించి ప్రాంతం అంత అహూ రాత్రులు వెతికారు. ఒక శుభ ముహూర్తాన శ్రీ యోగానంద నరసింహ స్వామి వారి మూర్తి దొరికింది(బైటపడింది). మహా వైభవముగా మూర్తి ని భద్రాచలము తీసుకోచారు . స్వామి వారి ఎచట ముఖముగా ప్రతిష్టించ వలెనని తికమక పడు చుండగా ఒక నాడు స్వామి వారు ప్రధాన అర్చక స్వామి వారి స్వప్నమున సాక్షాత్కరించి " నాయన! నన్ను భద్రాద్రి రామును ఎదురుగా గల చిన్న గుట్ట పై నా తిరు అవతార జన్మ తిది నాడు(వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం) ప్రతిష్ట కావింపుడు " అని అంతర్థానం అయ్యారు అంట . మరు నాటి నుండి స్వామి వారి మందిర నిర్మాణం మొదలైనది . స్వస్తి శ్రీ ఆనంద నామ సంవత్సరం.. వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్ర యుక్త అభిజిత్ లగ్నము నందు చిన్న గుట్ట పై స్వామి వారిని ప్రతిష్టించిరి . రోజు శాంతి కళ్యాణం చేసారు . భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయముగా శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయమునకు నిత్య నైమిత్తిక పూజాదులు జరుగుచుండెను.. గోదావరి లో బొబ్బలు పెట్టె వాడు అని ఒకప్పుడు బొబ్బల నరసింహ స్వామి అని కూడా ప్రసిద్ధం.


"నరహరి చరణము నమ్మిన వానికి
నరక భయము లేదు ఎన్నటికి"


మరింత సమాచారంతో త్వరలో మీ ముందుకు వస్తున్నాం!

భద్రసింహ అభిమానులు