BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS »

Friday, February 20, 2009

నరసింహావతార విశిష్ఠత - రెండో భాగం

నరవత్ సింహవష్చైవ! యస్వరూపం మహాత్మానాం!

నృసింహావతారము ఉగ్రావేశావతారము అని వేద పురాణెతిహాసములల తెలుపబడింది.పై వక్యమునకు అర్థం అదె. శ్రీ నృసింహావతారము క్రుజ, ఖేతల, స్ఠాణు , యానక, లక్ష్మీ, సుదర్శనముని, షడ్రూపం, త్రివిక్రమ రూపం, విరాఠ్రూపం గాను, శతపధబ్రాహ్మ్మనం లో తెలుపబడి ఉన్నది.

క్రూరం వీరం మహావిష్ణుం!
దివ్యంతం
సర్వతోముఖం!!

పుం మృగేంద్రం భయంకరం !
శుభం మృత్యోశ్చ మారకం!!

నరసింహా అనగా నర + ఇవసింహ + ఇవ ఆకృతి తిర్వశ్వేతి (నరుని వలె, సింహము వలె గల రూపము మూర్తికి ఉన్నదో మూర్తి నరసింహుడు.) అని చెప్పబడినది.ఇది నృసింహా పూర్వాతాపనోపనిషత్తు చెప్పిన రీతి.

ఉగ్రం వీరం మహా విష్ణుం!
జ్వలంతం సర్వతోముఖం !!
నృసింహం భీషణం భద్రం!
మృత్యో మృత్యుం నమామ్యహం!!

ఇది లక్ష్మీ నరసింహా స్వామీ వారి ధ్యానము. దశావతారములలో శ్రీ నృసింహావతారము బహుల ప్రచారము పొందినది. భగవంతుణి విభవావతారములలో ప్రధానమైనది నృసింహావతారం. భక్తుల పై అనుగ్రహాన్ని, దుష్టుల పై ఆగ్రహాన్ని వర్షించే విలక్షణ దైవం శ్రీ నృసింహ స్వామీ భాగవతములోని నృసింహావతారము విశిష్ఠత మరియూ ఆవస్యకత కింది విదముగా చెప్పబడినది.


జయ విజయులు వైకుంట ద్వారపాలకులు, ఒక నాడు భ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనక్సుజాతులు శ్రీ హరి దర్షనం కోసం వైకుంటనికి వచ్చారు. ద్వారపాలకులు ఆయిన జయ విజయులు వారిని అడ్డగించారు. అందుకు వారికి ఎంతో కొపం వచ్చింది. వెంటనే వాళ్ళిద్దరినీ రాక్షసులు గా పుట్టి , 3 జన్మలు విష్ణు ద్వేషులై ఉంటారని శపించారు. జయ-విజయులు మొదటి జన్మ లో హిరణ్యకశిప, హిరణ్యాక్షులు గా జన్మించారు.శ్రీ హరి హిరణ్యాక్షున్ని వరాహ రూపం ఎత్తి సంహరించాడు. తన తమ్ముడిని సంహరించిన విష్ణువు మీద హిరణ్యకశిపుడు పగ పట్టాడు. విష్ణువు సూక్ష్మరూపం దరించి హిరణ్యకశిపుని హృదయం లోకి చేరాడు.

అంతర్దృష్టి లేకుండా కేవలం బాహ్య దృష్టి మాత్రమే ఉన్న హిరణ్యకశిపుడు విషయాన్ని గ్రహించలేకపోయాడు. శ్రీ హరి పారిపోయాడని, మరణించి ఉంటాడని భ్రమించి, అలౌకిక శక్తులు సంపాదించాలని బ్రహ్మదేవుడి గురించి ఎంతో ఘోరంగా తపస్సు చేశాడు, బ్రహ్మ శృష్టించిన ప్రాణి చేత తనకి మృత్యువు రాకుడదని,లోపల కాని, వెలుపల కాని, పగలు కాని, రాత్రి కాని, ఆయుధాల చేత గాని, భూమి మీద కాని, ఆకశంలో కాని, నరుల చేత కాని, మృగాల చేత కాని, ప్రాణ సహితాల వలన కాని, ప్రాణ రహితాల వలన కాని, దేవతలు, రాక్షసులు, మహాసర్పాల వల్ల కానీ తనకి మృత్యువు కలగకూడదు అన్నాడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు. హిరణ్యకశిపుడు కోరిన వాటిని బ్రహ్మ అనుగ్రహించి, ఒక నియమం పెట్టడు. " బుద్ది సంపదతో, వివేకంతో, ఉత్తమమైన నడవడితో జీవించు" అని. హిరణ్యకశిపుడు అదొక్కటే విస్మరించాడు. దాని ఫలితమే అతని పతనం.


హిరణ్యకశిపుడు ఆ వరాలతో లోకాలని భాదించసాగాడు. ఆ హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు. ఐతే హిరణ్యకశిపుడుకి విరుద్దమైన భావాలతో ప్రహ్లాదుడు విష్ణు బక్తుడు గా మారాడు. కుమారుని పై ప్రేమ తో,విష్ణు బక్తి నుండి అతనిని మరల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు హిరణ్యకశిపుడు. సముద్రం లో ముంచినా, గదలతో కొట్టినా, పర్వతాల నుంచి కిందకి తోయించినా, పాములతో కరిపించినా, దావాగ్నులలో పడవేసినా ప్రహ్లాదుడిని ఏమీ చెయలేకపోయాడు.

ప్రహ్లాదుడికి భగవంతుని పై ఉన్న నమ్మకమే కాపాడింది. ఒక రోజున ప్రహ్లాదునితో వాదనకు దిగిన హిరణ్యకశిపుడు విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని గద్దించగ, శ్రీ హరి సర్వాంతర్యామి అని ప్రహ్లాదుడు చెప్పగా, ఈ స్తంభము లో నీ హరి ని చూపించగలవా? అని అదిగాడు హిరణ్యకశిపుడు, బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు అన్నిటిలోను ఉండే శ్రీ హరి ఆ స్తంభము లోనూ కలడు అని చెప్పాడు ప్రహ్లాదుడు.కోపావేశం పట్టలేక హిరణ్యకశిపుడు స్తంభాన్ని గదతో గట్టిగా మోదాడూ. వెంటనే ఆ స్తంభం లోంచి సగం వరకు మనిషిగా, సగం వరకు సింహం గా ఉన్న నరసింహ మూర్తి ఉద్భవించాడు.

సేకరణ: భద్రసింహ
మరిన్ని వివరములతో మీ ముందుకు వస్తాం..
ధన్యవాదములు.

Tuesday, February 17, 2009

నరసింహావతార విశిష్ఠత - మొదటి భాగం


శ్రీ మహావిష్ణువు అవతారాలు 3 తరగతులు గా విభజించబడ్డవి..
1. పూర్ణావతారం
2. ఆవేశావతారం
3. అంశావతారం
విష్ణు అవతారముల గూర్చి పలు భేదాభిప్రాయములు వ్యక్తమవుతూ ఉన్నవి. హరి అవతారములలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మోద్దరణ సంపూర్నముగా గల..

మత్స్య, కూర్మ, వరాహశ్చ, నారసింహశ్చ, వామనః !రామో, రామశ్చ, కృష్ణశ్చ, బుద్ధ, కల్కి రేవచః !!

మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ,శ్రీ రామశ్రీ కృష్ణ, బుద్ధ, కల్కి అనే దశావతారములు ఎంతో విశిష్టమైనటువంటివి. పరినామక్రమానికి దశావతారములకి సంభంధం వుంది.

దశావతారములలో
మొదటి నాలుగు అవతారములు ఒక విధమైతే, మిగిలిన ఆరు మరొక విధముగా ఉన్నవి. చివరి ఆరు అవతారాలకు తల్లి, తండ్రి, పుట్టుక నిర్దేశింపబడ్డవి.మొదటి నాలుగు విధముగా కాదు. అవి స్వయంభువులు. మొదటి మూడు జలచర, జలభూచర, భూచరముల అవతారములైతే, నాలుగవది అయిన నరసింహుడు జంతువులకు రాజైన సింహ రూపం తో మానవుని ఆకరము. అనగా మృగత్వము లోని పరిపుర్ణతకు మానవత్వం లోని ప్రారంభమునకు మద్యేమార్గం.

నృసింహావతార ఆవాసము వృక్ష సంపదలతో విలసిల్లె పర్వతారన్య గుహాప్రాంతం.హరితం అభ్యుదయానికి చిహ్నం. పరినామక్రమములో మానవునికి దగ్గర పోలికలు కలది మృగ స్వరూపం.నృసింహావతార ఆవిర్భావకాలం మాత్రం వైశాఖ శుద్ద చతుర్దశి, సాయంసమయ కాలముగా నిర్దేశింపబడింది. శ్రీ మన్నారాయణ దశావతారములలో ఈ నృసింహావతారం నాలుగొవది. ఇది చాలా ఉత్కృష్టమై, శక్తివంతమై, పవిత్రముగా ఉన్నది.ఉత్కృష్టమైన మానవ జన్మ, మృగ శ్రేష్ఠమైన సింహము జన్మలలీనముగా సమ్మెళనమై ఏకత్వముగా రూపొందిన విశెషావతారము ఇది..

నరసింహ స్వామి దివ్యదేహంలొ నాభి వరకు బ్రహ్మతత్వం, అక్కడి నుండి మెడవరకు విష్ణుతత్వంమెడనుంది శీర్షం వరకు రుద్రతత్వం వ్యాపించి ఉంటుందని నారసింహ తత్వాన్ని చెప్పారు మన మహర్షులు..

సత్యం విధాతుం నిజ బృత్య భాషితం
వ్యాప్తం చ భూతేష్వఖిలేషు చాత్మనం!

అద్రుశ్యతాత్యద్భుత రూపముద్వహన్
స్తంభేసభాయాం న మృగం న మానుషం!!



భావం:తన భక్తుని మాటను సత్యం అని నిరూపించడానికి, తాను సర్వభూతములలొ వ్యాపించిన విష్ణువునని తెలియచెసెందుకు యే నాడూ కనని, వినని అద్భుత రూపం లో అటు మృగమూ కానీ, ఇటు మానుషము కానీ నృసింహ స్వామి, దనుజ సభా స్తంభం లో ఆవిర్భవించాడు.ప్రహ్లాదుడు ఆయనను నమ్మినందువల్లనే, మహా మునులకు సైతం దుస్సాద్యమైన భగవత్ సాక్షాత్కారం, చిన్నబుడతకు సుస్సాద్యమైనది. ఆయన భక్త సులభుడు.

సేకరణ: భద్రసింహ

మరిన్ని వివరములతో మీ ముందుకు వస్తాం..
ధన్యవాదములు

Wednesday, February 11, 2009

స్వాతీ నక్షత్రం.. ఉంజల్ సేవ..

స్వాతీ నక్షత్రం..
పాపి కొండల వద్ద పావన గోదావరి నదిలో స్వామి వారి అర్చారూపం ఉద్భవించింది. స్వస్తి శ్రీ ఆనంద నామ సంవత్సరం.. వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రయుక్త అభిజిత్ లగ్నము నందు భద్రాచలము లో శ్రీ రామాలయము నకు ఎదురుగా చిన్న గుట్ట పై శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి వారిని ప్రతిష్టించిరి . అది స్వామి వారి తిరు అవతార జన్మ తిది .(వైశాఖ శుద్ధ చతుర్దశి స్వాతి నక్షత్రం).

అప్పటి నుండి స్వామి వారికీ స్వాతీ నక్షత్రం రోజున ప్రేత్యేక పూజాకార్యక్రమాలు జరుగుతున్నయి . స్వామివారు యోగీశ్వరుడు, కమనీయ విగ్రహుడు, ప్రసన్న ద్రుష్టి కలవాడు. ఆయనతో లక్ష్మి దేవిని కలిపి ఆరాధించాలి, కనుక లక్ష్మి దేవిని ముద్రించిన నిత్యను పాయినీ పతకాన్ని స్వామి వారి మెడ లో అలంకరించారు.


ఉంజల్ సేవ..
ప్రతి మాసంలో వచ్చే స్వాతీ నక్షత్రం రోజున శ్రీ నరసింహ స్వామి వారికీ ఉంజల్ సేవ జరుగుతుంది. ఉంజల్ సేవ కై ఈ మధ్య ఆలయంలో ఒక ప్రెత్యేక మండపం నిర్మించబడినది. నరసింహ స్వామి జన్మ తిది అయిన స్వాతీ నక్షత్రం రోజున స్వామివారి ఉత్సవ విగ్రహాలకు వైభవోపేతముగా ఉంజల్ సేవ జరుగుతుంది.

Sunday, February 8, 2009

స్వామీ..

స్వామీ..

ఏం చేసినా.. నా ప్రతి పనీ.. చివరికి నా నుండి... నిన్ను బయటకు తేవాలని.. ఆశీర్వదించు..
ఆశ.. ఆలోచన.. అయ్యే పని.. దాని ఫలితం.. అన్నీ నీవే.. అంతా నీవే.. అనే ఆ భావన..
నా చివరి దాక.. ఉండని..
సర్వే జనాః సుఖినోభవంతు..

శిరా

భద్రసింహ అభిమానులు