BLOGGER TEMPLATES AND TWITTER BACKGROUNDS »

Tuesday, February 17, 2009

నరసింహావతార విశిష్ఠత - మొదటి భాగం


శ్రీ మహావిష్ణువు అవతారాలు 3 తరగతులు గా విభజించబడ్డవి..
1. పూర్ణావతారం
2. ఆవేశావతారం
3. అంశావతారం
విష్ణు అవతారముల గూర్చి పలు భేదాభిప్రాయములు వ్యక్తమవుతూ ఉన్నవి. హరి అవతారములలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ, ధర్మోద్దరణ సంపూర్నముగా గల..

మత్స్య, కూర్మ, వరాహశ్చ, నారసింహశ్చ, వామనః !రామో, రామశ్చ, కృష్ణశ్చ, బుద్ధ, కల్కి రేవచః !!

మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ,శ్రీ రామశ్రీ కృష్ణ, బుద్ధ, కల్కి అనే దశావతారములు ఎంతో విశిష్టమైనటువంటివి. పరినామక్రమానికి దశావతారములకి సంభంధం వుంది.

దశావతారములలో
మొదటి నాలుగు అవతారములు ఒక విధమైతే, మిగిలిన ఆరు మరొక విధముగా ఉన్నవి. చివరి ఆరు అవతారాలకు తల్లి, తండ్రి, పుట్టుక నిర్దేశింపబడ్డవి.మొదటి నాలుగు విధముగా కాదు. అవి స్వయంభువులు. మొదటి మూడు జలచర, జలభూచర, భూచరముల అవతారములైతే, నాలుగవది అయిన నరసింహుడు జంతువులకు రాజైన సింహ రూపం తో మానవుని ఆకరము. అనగా మృగత్వము లోని పరిపుర్ణతకు మానవత్వం లోని ప్రారంభమునకు మద్యేమార్గం.

నృసింహావతార ఆవాసము వృక్ష సంపదలతో విలసిల్లె పర్వతారన్య గుహాప్రాంతం.హరితం అభ్యుదయానికి చిహ్నం. పరినామక్రమములో మానవునికి దగ్గర పోలికలు కలది మృగ స్వరూపం.నృసింహావతార ఆవిర్భావకాలం మాత్రం వైశాఖ శుద్ద చతుర్దశి, సాయంసమయ కాలముగా నిర్దేశింపబడింది. శ్రీ మన్నారాయణ దశావతారములలో ఈ నృసింహావతారం నాలుగొవది. ఇది చాలా ఉత్కృష్టమై, శక్తివంతమై, పవిత్రముగా ఉన్నది.ఉత్కృష్టమైన మానవ జన్మ, మృగ శ్రేష్ఠమైన సింహము జన్మలలీనముగా సమ్మెళనమై ఏకత్వముగా రూపొందిన విశెషావతారము ఇది..

నరసింహ స్వామి దివ్యదేహంలొ నాభి వరకు బ్రహ్మతత్వం, అక్కడి నుండి మెడవరకు విష్ణుతత్వంమెడనుంది శీర్షం వరకు రుద్రతత్వం వ్యాపించి ఉంటుందని నారసింహ తత్వాన్ని చెప్పారు మన మహర్షులు..

సత్యం విధాతుం నిజ బృత్య భాషితం
వ్యాప్తం చ భూతేష్వఖిలేషు చాత్మనం!

అద్రుశ్యతాత్యద్భుత రూపముద్వహన్
స్తంభేసభాయాం న మృగం న మానుషం!!



భావం:తన భక్తుని మాటను సత్యం అని నిరూపించడానికి, తాను సర్వభూతములలొ వ్యాపించిన విష్ణువునని తెలియచెసెందుకు యే నాడూ కనని, వినని అద్భుత రూపం లో అటు మృగమూ కానీ, ఇటు మానుషము కానీ నృసింహ స్వామి, దనుజ సభా స్తంభం లో ఆవిర్భవించాడు.ప్రహ్లాదుడు ఆయనను నమ్మినందువల్లనే, మహా మునులకు సైతం దుస్సాద్యమైన భగవత్ సాక్షాత్కారం, చిన్నబుడతకు సుస్సాద్యమైనది. ఆయన భక్త సులభుడు.

సేకరణ: భద్రసింహ

మరిన్ని వివరములతో మీ ముందుకు వస్తాం..
ధన్యవాదములు

6 comments:

durgeswara said...

adbhutaMgaa varnimchaaru svaami avataara rahasyaalanu.dhanyavaadamulu

చిలమకూరు విజయమోహన్ said...

వివరణ బాగుంది

Anonymous said...

Mee prayathnam.. chaala manchidi.. naalanti ... vallu.. meenundi.. spoorthi pondutaaru... meeku.. naa namassulu... Nrusimharpanam..

Anonymous said...

chaala baagundi!
yeduruchustunnamu.

Bhadrasimha said...

అందరికీ పేరుపేరునా ధన్యవాదములు.

Anonymous said...

very nice. come up with much more info.
All the best.

భద్రసింహ అభిమానులు