నరవత్ సింహవష్చైవ! యస్వరూపం మహాత్మానాం!
నృసింహావతారము ఉగ్రావేశావతారము అని వేద పురాణెతిహాసములలో తెలుపబడింది.పై వక్యమునకు అర్థం అదె. శ్రీ నృసింహావతారము క్రుజ, ఖేతల, స్ఠాణు , యానక, లక్ష్మీ, సుదర్శనముని, షడ్రూపం, త్రివిక్రమ రూపం, విరాఠ్రూపం గాను, శతపధబ్రాహ్మ్మనం లో తెలుపబడి ఉన్నది.
క్రూరం వీరం మహావిష్ణుం!
దివ్యంతం సర్వతోముఖం!!
పుం మృగేంద్రం భయంకరం !
శుభం మృత్యోశ్చ మారకం!!
నరసింహా అనగా నర + ఇవసింహ + ఇవ ఆకృతి తిర్వశ్వేతి (నరుని వలె, సింహము వలె గల రూపము ఏ మూర్తికి ఉన్నదో ఆ మూర్తి నరసింహుడు.) అని చెప్పబడినది.ఇది నృసింహా పూర్వాతాపనోపనిషత్తు చెప్పిన రీతి.
ఉగ్రం వీరం మహా విష్ణుం!
జ్వలంతం సర్వతోముఖం !!
నృసింహం భీషణం భద్రం!
మృత్యో మృత్యుం నమామ్యహం!!
ఇది లక్ష్మీ నరసింహా స్వామీ వారి ధ్యానము. దశావతారములలో శ్రీ నృసింహావతారము బహుల ప్రచారము పొందినది. భగవంతుణి విభవావతారములలో ప్రధానమైనది నృసింహావతారం. భక్తుల పై అనుగ్రహాన్ని, దుష్టుల పై ఆగ్రహాన్ని వర్షించే విలక్షణ దైవం శ్రీ నృసింహ స్వామీ భాగవతములోని నృసింహావతారము విశిష్ఠత మరియూ ఆవస్యకత కింది విదముగా చెప్పబడినది.
జయ విజయులు వైకుంట ద్వారపాలకులు, ఒక నాడు భ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనక్సుజాతులు శ్రీ హరి దర్షనం కోసం వైకుంటనికి వచ్చారు. ద్వారపాలకులు ఆయిన జయ విజయులు వారిని అడ్డగించారు. అందుకు వారికి ఎంతో కొపం వచ్చింది. వెంటనే వాళ్ళిద్దరినీ రాక్షసులు గా పుట్టి , 3 జన్మలు విష్ణు ద్వేషులై ఉంటారని శపించారు.ఆ జయ-విజయులు మొదటి జన్మ లో హిరణ్యకశిప, హిరణ్యాక్షులు గా జన్మించారు.శ్రీ హరి హిరణ్యాక్షున్ని వరాహ రూపం ఎత్తి సంహరించాడు. తన తమ్ముడిని సంహరించిన విష్ణువు మీద హిరణ్యకశిపుడు పగ పట్టాడు. విష్ణువు సూక్ష్మరూపం దరించి హిరణ్యకశిపుని హృదయం లోకి చేరాడు.
అంతర్దృష్టి లేకుండా కేవలం బాహ్య దృష్టి మాత్రమే ఉన్న హిరణ్యకశిపుడు ఈ విషయాన్ని గ్రహించలేకపోయాడు. శ్రీ హరి పారిపోయాడని, మరణించి ఉంటాడని భ్రమించి, అలౌకిక శక్తులు సంపాదించాలని బ్రహ్మదేవుడి గురించి ఎంతో ఘోరంగా తపస్సు చేశాడు, బ్రహ్మ శృష్టించిన ఏ ప్రాణి చేత తనకి మృత్యువు రాకుడదని,లోపల కాని, వెలుపల కాని, పగలు కాని, రాత్రి కాని, ఆయుధాల చేత గాని, భూమి మీద కాని, ఆకశంలో కాని, నరుల చేత కాని, మృగాల చేత కాని, ప్రాణ సహితాల వలన కాని, ప్రాణ రహితాల వలన కాని, దేవతలు, రాక్షసులు, మహాసర్పాల వల్ల కానీ తనకి మృత్యువు కలగకూడదు అన్నాడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు. హిరణ్యకశిపుడు కోరిన వాటిని బ్రహ్మ అనుగ్రహించి, ఒక నియమం పెట్టడు. " బుద్ది సంపదతో, వివేకంతో, ఉత్తమమైన నడవడితో జీవించు" అని. హిరణ్యకశిపుడు అదొక్కటే విస్మరించాడు. దాని ఫలితమే అతని పతనం.
హిరణ్యకశిపుడు ఆ వరాలతో లోకాలని భాదించసాగాడు. ఆ హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు. ఐతే హిరణ్యకశిపుడుకి విరుద్దమైన భావాలతో ప్రహ్లాదుడు విష్ణు బక్తుడు గా మారాడు. కుమారుని పై ప్రేమ తో,విష్ణు బక్తి నుండి అతనిని మరల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు హిరణ్యకశిపుడు. సముద్రం లో ముంచినా, గదలతో కొట్టినా, పర్వతాల నుంచి కిందకి తోయించినా, పాములతో కరిపించినా, దావాగ్నులలో పడవేసినా ప్రహ్లాదుడిని ఏమీ చెయలేకపోయాడు.
ప్రహ్లాదుడికి భగవంతుని పై ఉన్న నమ్మకమే కాపాడింది. ఒక రోజున ప్రహ్లాదునితో వాదనకు దిగిన హిరణ్యకశిపుడు విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని గద్దించగ, శ్రీ హరి సర్వాంతర్యామి అని ప్రహ్లాదుడు చెప్పగా, ఈ స్తంభము లో నీ హరి ని చూపించగలవా? అని అదిగాడు హిరణ్యకశిపుడు, బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు అన్నిటిలోను ఉండే శ్రీ హరి ఆ స్తంభము లోనూ కలడు అని చెప్పాడు ప్రహ్లాదుడు.కోపావేశం పట్టలేక హిరణ్యకశిపుడు స్తంభాన్ని గదతో గట్టిగా మోదాడూ. వెంటనే ఆ స్తంభం లోంచి సగం వరకు మనిషిగా, సగం వరకు సింహం గా ఉన్న నరసింహ మూర్తి ఉద్భవించాడు.
సేకరణ: భద్రసింహ
మరిన్ని వివరములతో మీ ముందుకు వస్తాం..
ధన్యవాదములు.
4 comments:
ధన్యవాదములు.
ఇంకా తెలుసుకోవడానికి ఎదురుచూస్తున్నా
ధన్యవాదములు.
informative post! nice
Good Post!!!!!!!
Post a Comment