Saturday, October 17, 2009
నరసింహక్షేత్రములు- చిత్తూరు జిల్లా
Posted by Bhadrasimha at 1:32 AM 2 comments
Labels: నరసింహక్షేత్రాలు
Tuesday, October 13, 2009
నరసింహ క్షేత్రాలు- అనంతపురం జిల్లా
మనకి తెలియని యెన్నో క్షేత్రాలు తెలుస్తాయి అని ఆశిస్తూ ఒక చిన్న ప్రయత్నముగా ఈ టపా.
Posted by Bhadrasimha at 9:09 AM 3 comments
Labels: నరసింహక్షేత్రాలు
Sunday, October 11, 2009
నరసింహ క్షేత్రాలు- ఆదిలాబాద్ జిల్లా
ఈ టపా లో జిల్లాల వారిగ నరసింహ క్షేత్రాలు ఒకదాని తర్వాత ఒకటి ప్రచురితం అవుతాయి ఒక నెల రోజుల పాటు.
Posted by Bhadrasimha at 6:55 AM 5 comments
Labels: నరసింహక్షేత్రాలు
Friday, April 3, 2009
భద్రాచలంలో శ్రీ రామనవమి ...


Posted by Bhadrasimha at 8:52 AM 6 comments
Labels: శిరా
Tuesday, March 17, 2009
భద్రాచల నరసింహాలయం 1
.jpg)
1. శ్రీ రామదాసు ధ్యాన మందిరం దారి నుండి శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం దృశ్యం..
.jpg)
2. శ్రీ స్వామి వారి ఆలయం మార్గమును సూచించు బోర్డూ
.jpg)
3. శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం..
.jpg)
4. శ్రీ స్వామి వారి గర్భాలయ ప్రెవేశ ద్వారం..
.jpg)
5. శ్రీ స్వామి వారి ఆలయం పై భాగాన సుదర్శన చక్రం..
.jpg)
6. శ్రీ స్వామి వారి ఆలయం లో నూతనంగా నిర్మించిన ధ్వజస్తంభం, ఉంజల్ సేవ గది..
.jpg)
7. శ్రీ స్వామి వారి ఆలయం ఎదురుగా గరుత్మంతుని నూతన విగ్రహం..
.jpg)
8. శ్రీ యోగానంద జ్వాల లక్ష్మి నరసింహ స్వామి వారి ఆలయం నుంచి శ్రీ రామాలయ దృశ్యం ..
Posted by Bhadrasimha at 10:11 AM 4 comments
Labels: విశిష్టత
Thursday, March 5, 2009
శ్రీ లక్ష్మీనరసింహ ఆష్టొత్తర శతనామావళి
Posted by Bhadrasimha at 6:00 AM 1 comments
Labels: స్తోత్రము
Friday, February 20, 2009
నరసింహావతార విశిష్ఠత - రెండో భాగం
క్రూరం వీరం మహావిష్ణుం!
దివ్యంతం సర్వతోముఖం!!
పుం మృగేంద్రం భయంకరం !
శుభం మృత్యోశ్చ మారకం!!
ఉగ్రం వీరం మహా విష్ణుం!
జ్వలంతం సర్వతోముఖం !!
నృసింహం భీషణం భద్రం!
మృత్యో మృత్యుం నమామ్యహం!!

జయ విజయులు వైకుంట ద్వారపాలకులు, ఒక నాడు భ్రహ్మ మానస పుత్రులైన సనక, సనందన, సనత్కుమార, సనక్సుజాతులు శ్రీ హరి దర్షనం కోసం వైకుంటనికి వచ్చారు. ద్వారపాలకులు ఆయిన జయ విజయులు వారిని అడ్డగించారు. అందుకు వారికి ఎంతో కొపం వచ్చింది. వెంటనే వాళ్ళిద్దరినీ రాక్షసులు గా పుట్టి , 3 జన్మలు విష్ణు ద్వేషులై ఉంటారని శపించారు.ఆ జయ-విజయులు మొదటి జన్మ లో హిరణ్యకశిప, హిరణ్యాక్షులు గా జన్మించారు.శ్రీ హరి హిరణ్యాక్షున్ని వరాహ రూపం ఎత్తి సంహరించాడు. తన తమ్ముడిని సంహరించిన విష్ణువు మీద హిరణ్యకశిపుడు పగ పట్టాడు. విష్ణువు సూక్ష్మరూపం దరించి హిరణ్యకశిపుని హృదయం లోకి చేరాడు.
అంతర్దృష్టి లేకుండా కేవలం బాహ్య దృష్టి మాత్రమే ఉన్న హిరణ్యకశిపుడు ఈ విషయాన్ని గ్రహించలేకపోయాడు. శ్రీ హరి పారిపోయాడని, మరణించి ఉంటాడని భ్రమించి, అలౌకిక శక్తులు సంపాదించాలని బ్రహ్మదేవుడి గురించి ఎంతో ఘోరంగా తపస్సు చేశాడు, బ్రహ్మ శృష్టించిన ఏ ప్రాణి చేత తనకి మృత్యువు రాకుడదని,లోపల కాని, వెలుపల కాని, పగలు కాని, రాత్రి కాని, ఆయుధాల చేత గాని, భూమి మీద కాని, ఆకశంలో కాని, నరుల చేత కాని, మృగాల చేత కాని, ప్రాణ సహితాల వలన కాని, ప్రాణ రహితాల వలన కాని, దేవతలు, రాక్షసులు, మహాసర్పాల వల్ల కానీ తనకి మృత్యువు కలగకూడదు అన్నాడు బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమైనప్పుడు. హిరణ్యకశిపుడు కోరిన వాటిని బ్రహ్మ అనుగ్రహించి, ఒక నియమం పెట్టడు. " బుద్ది సంపదతో, వివేకంతో, ఉత్తమమైన నడవడితో జీవించు" అని. హిరణ్యకశిపుడు అదొక్కటే విస్మరించాడు. దాని ఫలితమే అతని పతనం.

హిరణ్యకశిపుడు ఆ వరాలతో లోకాలని భాదించసాగాడు. ఆ హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు. ఐతే హిరణ్యకశిపుడుకి విరుద్దమైన భావాలతో ప్రహ్లాదుడు విష్ణు బక్తుడు గా మారాడు. కుమారుని పై ప్రేమ తో,విష్ణు బక్తి నుండి అతనిని మరల్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు హిరణ్యకశిపుడు. సముద్రం లో ముంచినా, గదలతో కొట్టినా, పర్వతాల నుంచి కిందకి తోయించినా, పాములతో కరిపించినా, దావాగ్నులలో పడవేసినా ప్రహ్లాదుడిని ఏమీ చెయలేకపోయాడు.
ప్రహ్లాదుడికి భగవంతుని పై ఉన్న నమ్మకమే కాపాడింది. ఒక రోజున ప్రహ్లాదునితో వాదనకు దిగిన హిరణ్యకశిపుడు విష్ణువు ఎక్కడ ఉన్నాడు అని గద్దించగ, శ్రీ హరి సర్వాంతర్యామి అని ప్రహ్లాదుడు చెప్పగా, ఈ స్తంభము లో నీ హరి ని చూపించగలవా? అని అదిగాడు హిరణ్యకశిపుడు, బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు అన్నిటిలోను ఉండే శ్రీ హరి ఆ స్తంభము లోనూ కలడు అని చెప్పాడు ప్రహ్లాదుడు.కోపావేశం పట్టలేక హిరణ్యకశిపుడు స్తంభాన్ని గదతో గట్టిగా మోదాడూ. వెంటనే ఆ స్తంభం లోంచి సగం వరకు మనిషిగా, సగం వరకు సింహం గా ఉన్న నరసింహ మూర్తి ఉద్భవించాడు.
సేకరణ: భద్రసింహ
మరిన్ని వివరములతో మీ ముందుకు వస్తాం..
Posted by Bhadrasimha at 7:33 PM 4 comments
Labels: నరసింహావతారం




